పెళ్లి బట్టల్లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరో ,హీరోయిన్స్ అయినా విజయ్ దేవరకొండ, రష్మిక మందన ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరూ పెళ్లి బట్టల్లో ఉన్న ఒక ఫోటో వైరల్ గా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమా అబద్దమా తెలుసుకుందాం .

టాలీవుడ్ లో ఈ జంటకు చాలా పెద్ద క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఒకటి గీత గోవిందం. 2018 సంవత్సరంలో ఈ మూవీ రిలీజ్ అయింది.ఈ మూవీ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. రెండో సినిమా డియర్ కామ్రేడ్ ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. రష్మిక కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయి.

పెళ్లి బట్టల్లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న ఫోటో
పెళ్లి బట్టల్లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న ఫోటో

కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ న్యూస్ లు కూడా వచ్చాయి. కొన్నిసార్లు డిన్నర్లకు, పార్టీలకు కూడా కలిసి వెళ్లారు. ఈ మధ్యకాలంలోనే మాల్దీవ్స్ కి కలిసి వెళ్లారని టాక్ కూడా వినిపించింది. ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి దుస్తువుల్లో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కానీ వీళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోలేదు. ఈ ఫోటోను ఒక అభిమాని ఈ విధంగా సెట్ చేశాడు. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంట చూడముచ్చటగా ఉంది. వీరిద్దరి ఫ్రాన్స్ ఈ ఫోటోని చూసి జంట బాగుందని మురిసిపోతున్నారు.

ఇంతకుముందు అయితే ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి.కిరిక్ పార్టీ షూటింగ్ టైంలో తన తోటి నటుడైన రక్షిత్ శెట్టితో డేటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ జంట 2017 జూలై మూడో తేదీ విరాజ్ పేటలో నిశ్చితార్థం చేసుకున్నారు.

వ్యక్తిగత కారణాలవల్ల 2018 సెప్టెంబర్ నెలలో వీళ్లు నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి బట్టల్లో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటో నిజంగా వాళ్ళు పెళ్లి చేసుకున్న ఫోటో కాదు ఒక అభిమాని ఇలా క్రియేట్ చేశాడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker