2022 శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి? శ్రీ కృష్ణాష్టమి యొక్క విశిష్టతలు

అష్టమి రోజున శ్రీ మహావిష్ణువు  శ్రీకృష్ణుని అవతారంగా జన్మించాడు.

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకుఎనిమిదో సంతానంగా అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో జన్మించాడు.

ఏ పేరుతో పిలిచినా అదే అవతారంలో కనిపించే ప్రత్యేకమైనది కృష్ణవతారం.

కృష్ణాష్టమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని, గడపలకు పసుపు రాసి, పూల తోరణాలు కట్టి, ఇంటి లోపల శ్రీకృష్ణుని పాదాలు వేసి కృష్ణుని పూజిస్తారు.

కృష్ణాష్టమి రోజున ఇంటిలో ఉండే బాలురకు చిన్ని కృష్ణుని రూపంలో అలంకరిస్తారు.

వెన్న, నెయ్యితో చేసిన వంటకాలు, పానకం, అటుకులతో తయారుచేసిన పిండి వంటలు, మినప పిండిని పంచదారను కలిపి కాయం తయారు చేసి నైవేద్యంగా పెడతారు.

బాలికలకు గోపిక రూపంలో ముస్తాబు చేస్తారు.

ఈ సంవత్సరం కృష్ణాష్టమి నాలుగవ శ్రావణ శుక్రవారం రెండు కలిసి వచ్చాయి

ఈ సంవత్సరం గురువారం రాత్రి 12 గంటల 30 నిమిషాలకు అష్టమి ప్రారంభమై శుక్రవారం రాత్రి 1:02 నిమిషాల వరకు ఉంటుంది.

ఈ రోజున కొంతమంది ఉదయం పూట వరలక్ష్మీ వ్రతం చేసుకొని సాయంత్రం 6:00ల నుండి 7:00 గంటల లోపు కృష్ణుని పూజ చేసుకుంటారు.

కృష్ణునికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులను ఆచమనం చేసేటప్పుడు వాడుతారు.

కృష్ణాష్టమి రోజు పూజ చేయాలనుకునేవారు శుక్రవారం వేకువ జామున 4:30ల నుండి పూజ చేసుకోవచ్చు.

కృష్ణాష్టమి రోజున  ఉసిరికాయతో నువ్వులను కలిపి చేసిన పిండితో స్నానాలు చేస్తారు.

పొన్న చెట్టు పూలతో కృష్ణుడిని అలంకరిస్తారు.