19-08-2022 వ తేదీ  రాశి ఫలాలు, దిన ఫలాలు

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, శ్రావణ మాసం,

సూర్యోదయం       :  5.45 సూర్యాస్తమయం  :  6.25

మేష రాశి :ఉద్యోగంలో అధికారులతో చర్చలు జరుగుతాయి 19-08-2022 వ్యాపారాల్లో, వృత్తులలో కొత్త వ్యవహారాలు ముఖ్యమైన నిర్ణయాలు ఫలిస్తాయి చేపట్టిన పనులు అరకొరగా పూర్తవుతాయి ఇంకా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు వింటారు.

వృషభ రాశి :చేపట్టిన పనులు వాయిదా వేయడం ఉత్తమం వ్యాపార విషయంలో సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లడం ఫలిస్తాయి 19-08-2022 ఉద్యోగంలో పని భారం ఎక్కువ అవుతుంది,  కుటుంబంలో పరిస్థితి బాగుండదు వృధా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మిధున రాశి: బంధుమిత్రుల నుండి నుంచి అనుకోకుండా ధన ప్రాప్తి కలుగుతుంది 19-08-2022 నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలుగుతాయి కుటుంబ వ్యవహారాలు ముఖ్యమైన నిర్ణయాలను అమలు పరుస్తారు వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటక రాశి: చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు 19-08-2022 ఇంట, బయట అనుకూల పరిస్థితులు కలుగుతాయి, వ్యాపారంలో ఆశించిన అభివృద్ధి పొందుతారు నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు కొత్త వాహన కొనుగోలు చేస్తారు,ఆర్థిక పురోగతి కూడా పొందుతారు.

సింహ రాశి: ఉద్యోగ విషయంలో మనస్పర్ధలు, వివాదాలు కలుగుతాయి 19-08-2022 ఆర్థిక పురోగతి అంతంత మాత్రమే ఉంటుంది వ్యాపారాలలో, వృత్తులలో కొత్త సమస్యలు కలుగుతాయి దైవ కార్యక్రమంలో పాలు పొందుతారు, దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి: కొత్త వ్యాపారాలు ప్రారంభమవుతాయి 19-08-2022 ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని అధికమించి ముందుకు వెళ్తారు కొత్త రుణ ప్రయత్నాలు కలుగుతాయి ఉద్యోగాలలో, వృత్తులలో అనుకోకుండా స్థాన చలనాలు కలుగుతాయి.

తుల రాశి: అనుకోకుండా ధన ప్రాప్తిని పొందుతారు, కుటుంబంలో ఆశ్చర్యకరమైన విషయాలను వింటారు 19-08-2022 కొత్త వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో, వ్యాపారాలలో చికాకులు, మనస్పర్ధలు పరిష్కారం అవుతాయి పాత మిత్రుల కలయిక, సమాజంలో పేరు ప్రఖ్యాతలు, కొత్త పరిచయాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి: స్థిరాస్తి క్రయ విక్రయాలలో కొత్త లాభాలను చేకూరుస్తాయి 19-08-2022 కొత్త వస్త్రాలు, ఆభరణాలను కొంటారు కొత్త ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తారు ఉద్యోగాలలో వృత్తులలో కొత్త ఉత్సాహం కలుగుతుంది, ఆప్తులతో సఖ్యతను పొందుతారు.

ధనుస్సు రాశి: దూర ప్రయాణాలలో జాగ్రత్త గా ఉండాలి, ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధ పెడతాయి. వ్యాపారాలలో, వృత్తులలో అరకొరగా జరుగుతాయి 19-08-2022 ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది, కుటుంబ సభ్యులతో అనుకోని సంఘటనలు ఏర్పడతాయి.

మకర రాశి: దూర ప్రయాణాలలో శ్రమ ఎక్కువవుతుంది 19-08-2022 వ్యాపారాలలో వృత్తులలో నిరాశ ఉంటుంది ఉద్యోగంలో గందరగోళం నెలకొంటుంది బంధుమిత్రుల నుండి అందిన సమాచారం మేరకు మానసిక ఒత్తిడి బాధనిస్తుంది చేపట్టిన పనులలో అడ్డంకులు ఎదురవుతాయి దీర్ఘకాలిక రుణాలను తీర్చడానికి కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు.

కుంభ రాశి: ఉద్యోగాలలో వృత్తులలో శ్రమ ఎక్కువవుతుంది  భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకోని లాభాలు చేకూరుతాయి 19-08-2022 చేపట్టిన పనులు యధావిధిగా జరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పొందుతారు.

మీన రాశి: ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేస్తే నష్టాన్ని తెచ్చి పెడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులు వ్యతిరేకిస్తున్నాయి. ఇంటి పక్కన వారితో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి 19-08-2022 వ్యాపారాలలో, వృత్తులలో మందకొడిగా ఉంటుంది, చేపట్టిన పనులు జాప్యం కలుగుతాయి.

వార ఫలాల కోసం