టొమాటో ఫ్లూ అంటే ఏంటో తెలుసా?

భారతదేశంలో మరొక కొత్త వ్యాధి వ్యాపించింది ఆ వ్యాధి టమోటా ఫ్లూ.

ఈ వ్యాధి మొదటగా కేరళలో మే 6వ తేదీన నమోదు అయింది.

టమోటా ఫ్లూ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లలకు(1-9) వ్యాపిస్తుంది.

పెద్దవారిలో ఈ వ్యాధి లక్షణాలు త్వరగా కనిపించవు.

 టమాటో ఫ్లూ వ్యాధి కేవలం ఇండియాలో మాత్రమే వ్యాప్తి చెందింది.

ఈ వ్యాధిలో ఎక్కువగా అనారోగ్యకరమైన జ్వరం నోటిలో పుండ్లు వస్తాయి.

కాళ్లు, చేతులు ముఖంపై ఎర్రటి దద్దుల రూపంలో ఈ వ్యాధి సోకుతుంది.

చేతులకు, పాదాలకు, ముఖంపై బొబ్బలతో కూడుకున్న దద్దులు వంటివి కూడా ఈ వ్యాధి లక్షణాలు.

జ్వరం, కీళ్ల నొప్పులు, కీళ్లవాపు అలసట వంటి వాటి వల్ల ఈ వ్యాధిని గుర్తించవచ్చు