మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే కాల్షియం ఉన్న ఆహారం, ఆకుకూరలు,పాలు,చేపలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి
ప్రతిరోజు అరగంట పాటు సూర్యోదయం ఎండలో ఉండడంవల్ల మన శరీరానికి D విటమిన్ లభిస్తుంది, D విటమిన్ ఎముకలకు చాలా ఉపయోగకరం
తినే ఆహార పదార్థాలలో రాగులు,సజ్జలు లాంటి చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి.
నువ్వులు మరియు తాటి బెల్లం ను మిశ్రమంగా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఉదయం లేవగానే రోజు ఒక ఉండ చొప్పున తినాలి
50 గ్రాముల సొంటి,50 గ్రాముల మెంతులు,50 గ్రాముల వాము,తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చ నీటిలో ఈ మిశ్రమమును బెల్లం కలుపుకొని తాగాలి
ప్రతిరోజు ఆహారం భుజించాక ఒక అరటిపండు తీసుకోవాలి.అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి.
ఒక గ్లాసు పాలలో అర టీ స్పూన్ పసుపు కలుపుకొని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
డాక్టర్ గారి సలహా మేరకు జాగింగ్ మరియు ఇతర వ్యాయామాలు చేయాలి
రాత్రి పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద మెత్తటి దిండు ను ఉంచుకుని నిద్రించాలి.