ఉల్లిపాయల వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
నాలుగు స్పూన్ల ఉల్లిపాయ రసానికి చిటికెడు ఇంగువ పొడి నల్ల ఉప్పు కలిపి రెండు లేదా మూడు సార్లు తాగితే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటివి తగ్గుతాయి
ఉల్లిపాయ గుజ్జుకు తగినంత వెనిగర్ కలిపి ఆహారంగా తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది.
ఉల్లిపాయలకు బ్యాక్టీరియాను ఆకర్షించే గుణం ఉంటుంది అందువల్ల వాటిని ఆహారంగా తీసుకోకపోయినా, ఒక గిన్నెలో పెట్టి పక్కన ఉంచుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.
ప్రతిరోజు 200 గ్రాముల ఉల్లిపాయ ముక్కలను ఆహారంగా తీసుకోవడం ద్వారా షుగర్ ఉన్నవారికి షుగర్ కంట్రోల్ కు వస్తుంది.
ఉల్లిపాయను కొన్ని మిరియాలు కలిపి బాగా మెత్తగా దంచి గుడ్డలో పెట్టి వడపోసి వచ్చిన రసానికి స్పటిక బెల్లం కలిపి తాగితే కలరా లక్షణాలను తగ్గించుకోవచ్చు.
ఉల్లిపాయల్లో అనేక రకాలు ఉన్నాయి వాటిలో తెల్లవి, ఎర్రవి ,చిన్నవి, పెద్దవి, ఎక్కువ వాసన వచ్చేవి, తక్కువ వాసన వచ్చేవి, తీయనివి, కూడా ఉంటాయి.
ముక్కులో నుంచి రక్తం వచ్చేటప్పుడు ఉల్లిపాయను కట్ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపిస్తే రక్తస్రావం ఆగిపోతుంది.
ఉల్లిపాయ ముక్కలను మజ్జిగలో కలిపి తీసుకుంటే అనేక ఉపయోగాలను పొందవచ్చు.
కొన్ని ఉల్లిపాయ ముక్కలను నీళ్లలో వేసి బాగా ఉడికించి అందులో కొంచెం తేనె కలిపి తీసుకుంటే మూత్రంలో వచ్చే మంటను అదుపు చేసుకోవచ్చు
కొంచెం ఉల్లిపాయ రసం, ఆవు నెయ్యి ,తేనె కలిపిన పాలను రాత్రిపూట తాగితే బలహీనత నుంచి బయటపడవచ్చు.
ఉల్లిపాయ రసం ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఆడవారికి వచ్చే నెలసరి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. .
చెవి నొప్పి ఉన్నవారు దూదిలో కొంచెం ఉల్లిపాయ రసాన్ని పిండుకొని చెవిలో పెట్టుకుంటే చెవిపోటు తగ్గుతుంది.