ముల్లంగి పచ్చడిని ఈ విధంగా చేయడం ద్వారా ఎప్పుడు తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు.

ముల్లంగిని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

బాండీలో నూనె వేసి స్టవ్ పై పెట్టి అందులో కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి.

అలాగే పచ్చిమిర్చి తో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించాలి.

వీటితో పాటుగా ఒక గడ్డ వెల్లుల్లిపాయలను పొట్టు తీసి అందులో వేసి బాగా వేయించాలి.

ముల్లంగిని వేయించేటప్పుడు కొంచెం పసుపు వేయడం ద్వారా ర్యాడిష్ వాసన రాకుండా ఉంటుంది.

తర్వాత అన్నిటినీ కలిపి కొంచెం ఉప్పు వేసి, రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి.

నూనె కాగాక అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి కొంచెం కరివేపాకు, వేసి వేగనివ్వాలి .

కచ్చ కచ్చా గా దంచుకున్న పచ్చడిని నూనెలో వేసి పోపు పెట్టుకోవాలి ఇంతటితో ముల్లంగి పచ్చడి రెడీ అయింది.

ఈ విధంగా ర్యాడిష్ పచ్చడి తయారు చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. అందువల్ల ర్యాడిష్ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందవచ్చు.