మీరు అందంగా ఉండాలనుకుంటున్నారా, అయితే ఈ చిట్కాలు మీకోసం...
ఒక కప్పు వేపాకులు నీటిలో వేసి బాగా ఉడికించుకోవాలి అ నీటితో ముఖాన్ని కడుక్కుంటే ఆయిల్ స్కిన్ ఉన్నవారు మంచి ఫలితం పొందవచ్చు.
బొప్పాయి పండు గుజ్జులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకుని ఆ పేస్టును ఎండ ద్వారా నల్లబడిన చర్మం పై పూసి కొద్దిసేపటి తర్వాత కడుగుతే మంచి ఫలితం ఉంటుంది.
పల్లీలను బాగా నానబెట్టి మెత్తటి పేస్టులా తయారు చేసుకుని దానిని ముఖానికి పూసుకొని బాగా ఆరిన తర్వాత కడిగితే ముఖం కంటికాంతివంతంగావంతంగా ఉంటుంది.
బొప్పాయి పండును పేస్టులా చేసుకుని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేస్తే చర్మం ముడతలు పడకుండా ఉండి ముసలి ముడతలు కనిపించకుండా ఉంటాయి.
ముఖానికి గోపురం పసుపు పూసుకొని బాగా ఆరిన తర్వాత కడిగితే, ఎండ వల్ల వచ్చే నల్లధనం పోయి కాంతివంతంగా ఉంటుంది.
వేపాకును పేస్టులా చేసి వాడడం వల్ల ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలు పోయి కాంతివంతంగా ఉంటుంది.
టమోటా ను రెండు ముక్కలుగా కట్ చేసుకుని , టమోటాతో వంటసోడా అద్దుకొని ఫేస్ పై బాగా రుద్ది మసాజ్ చేస్తే ముఖంపై ఉండే మృత కణాలు తొలగి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
ఒక కప్పు పెరుగులో, కొంచెం సెనగపిండి, అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ పేస్టును ముఖానికి బాగా పట్టించి అది ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే ముఖంపై ఉండే ట్యానింగు పూర్తిగా తొలిగిపోతుంది.
ఈ పేస్టులను ముఖానికి ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి.
ఈ చిట్కాలను వారానికి ఒకసారి ఉపయోగించడం వల్ల ముఖంపై ముసలి మడతలు త్వరగా రావు.
ముఖంపై ఉండే నల్లటి మచ్చలు త్వరగా పోయి ముఖం అందంగా కాంతివంతంగా ఉంటుంది.