గత సంవత్సరం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎంత డిమాండ్ ఉందో అప్పటి బుకింగ్స్ చూస్తే తెలుస్తుంది.

కానీ ఈ మధ్యకాలంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల పై చాలా ఫిర్యాదులు రావడంతో, వీటికి డిమాండ్ తగ్గిందనే భావన చాలామందిలో నెలకొంది.

కానీ తాజాగా ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త స్కూటర్ బుకింగ్స్ చూస్తుంటే ఈ కంపెనీ స్కూటర్ డిమాండ్ తగ్గిందని కాదు పెరిగిందని చెప్పవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఒక్కరోజులోనే S1 ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఏకంగా రికార్డ్ స్థాయిలో 10,000 బుకింగ్స్ నీ అందుకుంది.

ఆగస్టు 2022లో ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను 99,999 రూపాయల ధరతో కంపెనీ రీలాంచ్ చేసింది.

బుకింగ్స్ అయిన స్కూటర్లను సెప్టెంబర్ 7న నాటికి డెలివరీ చేయడం మొదలుపెడతామని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వెల్లడించింది.

కేవలం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు 2,999 EMI కడుతూ స్కూటర్ ని ఇంటికి తీసుకెళ్లొచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ ఎండ్ వేరియంట్ S1pro ను1,39,999 రూపాయలకు కంపెనీకి నిర్ణయించింది.

లిక్విడ్ సిల్వర్, ఫోర్సీలిన్ వైట్, జెట్ బ్లాక్, కోరల్ గ్లామ్, నియోమింట్ వంటి ఐదు కలర్ ఆప్షన్స్ తో ఓలా S1 స్కూటర్ అందుబాటులో ఉంది.