షాపింగ్ చేసేవారికి శుభవార్త అయితే కొన్ని రోజులు ఆడాల్సిందే!. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ లతో త్వరలో ది బిగ్ బిలియన్ డేస్  నిర్వహించనుంది.

స్మార్ట్ ఫోన్ నుంచి స్మార్ట్ టీవీ వరకు అన్నింటి పై భారీ డిస్కౌంట్ ను ఇస్తుంది.

ఈ ఆఖరికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం బిగ్ బిలియన్ డేస్ ఈనెల 23 నుంచి 30 వరకు ఉంటుందని సమాచారం.

99 రూపాయలు విలువ చేసే చిన్న చిన్న వస్తువులు మొదలు 1 లక్ష విలువ చేసే లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే విధంగా ఆఫర్లు ప్రకటించింది.

ఎలక్ట్రిక్ వస్తువులపై 80% వరకు డిస్కౌంట్ ఇస్తుంది. స్మార్ట్ ఫోన్లు, గేమింగ్ లాప్టాప్స్,ప్రింటర్స్,మానిటర్స్,మొబైల్ యాసెసరిస్, ట్రిమ్మర్స్,హెడ్ ఫోన్స్ తదుపరి వస్తువులపై ఈ డిస్కౌంట్ను అందుకోవచ్చు.

అంతేకాకుండా స్మార్ట్ టీవీలు,వాషింగ్ మిషన్లు,ఏసీలు,ఫ్యాన్లు,గీజర్లు ఇతరత్రా గృహోపరికరణాలపై కూడా 80% డిస్కౌంట్ అందుబాటులోకి తెచ్చింది.

అంతేకాకుండా బిగ్ బిలియన్ డేస్ కోసం ఫ్లిప్ కార్ట్ ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ లతో టైఅప్ అయ్యి, దాని ద్వారా ఈ బ్యాంక్ కార్డులపై బిగ్ బిలియన్ డేస్ సేల్ లో 10% తక్షణ తగ్గింపు పొందే ఆఫర్ అందుబాటులోకి వస్తుంది.

ఇందులో భాగంగా ఐఫోన్ 12,ఐఫోన్ 13 సేల్స్ జరపనుంది. దీంతోపాటు ఈ బుధవారం విడుదల ఐఫోన్ 14 సిరీస్ కూడా సేల్స్ చేయబడనుంది.

వీటితోపాటు రియల్ మీ,పోకో,వివో, యాపిల్, శాంసంగ్ ఫోను డిస్కౌంట్ సేల్స్ చేయనుంది.