మనం వండకునే కూరగాయల్లో ప్రతీ భాగాన్ని ఉపయోగిస్తుంటాం. ఇప్పడుంటే కొందరు వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు
కూరగాయలోని ప్రతీ భాగాన్ని వంట చేసేవారు. ఎందుకంటే.. ప్రతీది ఆరోగ్యానికి మంచిదని, అందలోనూ విలువైన పోషకాలు ఉంటాయని చెబుతారు. ఇదే విషయం బాదం పప్పులకూ వర్తిస్తుందని చెప్పుకోవాలి.
ప్రస్తుత కాలంలో చాలా మంది బాదం పప్పులను తొక్క తీసి తింటుంటారు. అయితే, బాదం తొక్కల వలన కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బాదం పప్పులో మాదిరిగానే ఈ తొక్కలోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని, ఇది మీ జుట్టు, చర్మం, నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు.
ఇక బాదం తొక్కలు మేలు చేస్తాయి. బాదం తొక్కలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.
కొన్ని రకాల చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుంది. బాదం తొక్కలను పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేస్తే.. మంచి ప్రయోజనం ఉంటుంది.
బాదం తొక్కలను వేడి చేసి, వాటిని పొడిగా చేయాలి. ఆ ఫౌడర్‌ను దంతాలకు అప్లై చేయాలి. ఇది దంత సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది.
తల, జుట్టులో దురద, పేను సమస్య ఉంటే.. బాదం, బాదం తొక్క ఉపయోగించడం ద్వారా చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆయుర్వదం ప్రకారం.. బాదం తొక్కలను పేస్ట్ చేసి తలకు రాసుకుంటే.. ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు
బాదం పప్పు తొక్కలను పేస్ట్ చేసి అలెర్జీ ఉన్న ప్రదేశంలో రాయాలి. మొటిమలు, కురుపులకు కూడా ఇది వర్తిస్తుంది. మనకు అప్పుడప్పుడు ముఖం మీద కానీ చర్మవ్యాధులు గాని సాధారణంగా వస్తూ ఉంటాయి.