చక్కెరను తినడం కంటే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి.బెల్లం తింటే ఎన్నో లాభాలు ఉంటాయి.

చిన్నారులు,పెద్దలు ఇకనైనా రోజు కొంత బెల్లం తింటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్తున్నారు.

అజీర్తి,మలబద్ధకం,నెలసరిలో చిక్కులు రక్తహీనత లాంటి వాటిని మాయం చేసే శక్తి బెల్లంలో ఉంది.

క్యాల్షియం,మెగ్నీషియం,పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్స్,సి బి2 లాంటి విటమిన్లు అధికంగా ఉంటాయి.

రోజు కొంచెం బెల్లం తినడంతో అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా శరీరంలోకి తక్షణ శక్తి లభిస్తుంది.

బెల్లాన్ని నేరుగా కాకుండా ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితాన్ని ఇస్తుంది.

బెల్లంతో కాస్త నెయ్యి కలిపి తీసుకుంటే మలబద్దకం తగ్గిపోతుంది. ధనియాలతో కలిపి తింటే నెలసరి కడుపునొప్పి తగ్గిపోతుంది.

సొంపుతో కలిపి తింటే నోటి దుర్వాసన పోతుంది. జుట్టు రాలిపోతున్నప్పుడు గుప్పెడు మెంతులతో కలిపి రోజు తీసుకుంటే వెంట్రుకల కుదుళ్లు దృఢంగా మారుతాయి.

బెల్లానికి నువ్వులతో కలిపి తింటే దగ్గు,జలుబు, ప్లూ లక్షణాలు వుంటే కూడా తగ్గిపోతాయి. పల్లిలతో తింటే బలం బాగా పెరుగుతుంది.

More Details