వరి, గోధుమ లకు బదులు తృణధాన్యాలు లేక సిరి ధాన్యాలతో తయారైన ఆహార పదార్థాలను తినిపించాలి.

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లను తినిపించరాదు,వాటికి అలవాటు చేయరాదు.

ఆయిల్ ఎక్కువగా వాడిన ఆహార పదార్థాలు,ఆయిల్లో వేయించిన వేపుళ్ళ ను ఎక్కువగా తినిపించరాదు.

మంచినీటిని ఎక్కువగా త్రాగేలా అలవాటు చేయాలి.

ప్రోటీన్స్ మరియు విటమిన్స్ మరియు బలవర్ధక ఆహార పదార్థాలు తినిపించాలి.

రోజులో కనీసం ఆహార పదార్థాల్లో రెండు టీ స్పూన్ లా  స్వచ్ఛమైన నెయ్యి ఉండేలా చూడాలి.

రోజులో కనీసం ఒక పండు మరియు ఒక గుడ్డును తినిపించాలి.

వేరుశనగ, నువ్వులు, కొబ్బరి లతో బెల్లం కలిపి ఉండలుగా చేసి రోజుకు ఒకటి చొప్పున తినిపించాలి.

వయసుకు తగ్గ వ్యాయామాలు చేయించాలి.