సపోటా పండు తినడం వల్ల ఉపయోగాలు

చిన్నగా కనిపించే సపోటా పండులో మనకు తెలియని చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

సపోటా లో ఉండే గింజల నుంచి బెరడు వరకు అన్నీ కూడా చాలా సమస్యలకు పరిష్కారంగా ఉపయోగపడతాయి.

సపోటా బెరడును ఉడకబెట్టి కషాయం తాగడం వల్ల జ్వరాన్ని నయం చేస్తుంది.

సపోటా పండు గుజ్జును నొప్పి వున్న చోట పూస్తే నొప్పిని,వాపును తగ్గిస్తుంది.

సపోటా పండు జీవక్రియను మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

సపోటా పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది.

కంటి చూపుకి అవసరమయ్యే విటమిన్ A ఈ సపోట పండులో పుష్కలంగా దొరుకుతుంది.

ప్రతిరోజు సపోటా పండు తినడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్ తొలగిపోయి,కాలేయం దృఢంగా మారుతుంది.