కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు ఇవే!

Siva

కార్తీక మాసం అంటే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది.

ఈ సంవత్సరం కార్తీకమాసం అక్టోబర్ 26వ తేదీ ప్రారంభమై నవంబర్ 23వ తేదీ వరకు ఉంటుంది.

మహావిష్ణు కు సమానమైన దేవుడు లేడు, వేదాలకు సమానమైన శాస్త్రం లేదు, గంగకు సమానమైన తీర్థం మరొకటి లేదని స్కంద పురాణాల నుండి చెప్పబడింది.

కార్తీక మాసంలో శివునికి, విష్ణువుకి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.

కార్తీక మాసం ఆచరించే వారు రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించాలి.

శాకాహారాన్ని తప్ప మాంసాహారం ముట్టుకోకూడదు.

దేవునిపై ఎక్కువగా భక్తి, విశ్వాసాన్ని చూపిస్తూ నిత్యం పూజలు చేసుకుంటూ ఉండాలి.

కార్తీకమాసంలో ఎక్కువగా దానధర్మాలు చేయాలి.

కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి, చన్నీటి స్నానం చేసి, పూజ చేసుకుని దీపాలను గంగలో వదలాలి.

భక్తిశ్రద్ధలతో దీపారాధన చేయాలి.

నదులలో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలను నదులలో వదిలి భక్తితో దేవుని స్మృతించాలి.

తులసి కోట దగ్గర కార్తీకదీపం ఉంచి ప్రతిరోజు పూజ చేసుకోవాలి.

ఇంటి గుమ్మాల వద్ద, ఆలయాలలో దీపాలను వెలిగించాలి.