హాస్పిటల్ పాలైన సూపర్ స్టార్ కృష్ణ.
By Siva
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరారు.
కొంతకాలం నుండి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.
ఆ సమస్య తీవ్రమవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కృష్ణ గారికి వైద్యం చేయిస్తున్నారు.
వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం చేస్తున్నారు, అయితే ఆయన ఎలా ఉన్నాడు అనే విషయం ఇంతవరకు బయటికి రాలేదు.
1965 లో వచ్చిన తేనెమనసులు సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
కృష్ణ ,ఇందిరా దేవి గార్లకు కూడా రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల ప్రియదర్శిని, ఐదుగురు పిల్లలు.
సినిమాలలో నటిస్తూనే విజయనిర్మల గారిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
కృష్ణ గారితో పెళ్లికి ముందే విజయనిర్మల గారికి సీనియర్ నటుడు నరేష్ జన్మించాడు.
కృష్ణ గారు ఐదు దశాబ్దాలుగా 350 కి పైగా సినిమాలలో నటించాడు.
2019లో రెండవ భార్య అయిన విజయనిర్మల గుండెపోటుతో మరణించింది.
కృష్ణ మొదటి కొడుకు అయిన రమేష్ బాబు కాలేయ వ్యాధితో 2022 జనవరి 8వ తేదీన మరణించాడు.
కొన్ని రోజుల క్రితమే కృష్ణ గారి మొదటి భార్య అయిన ఇందిరా దేవి గారు మరణించారు.