హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అబ్బాస్.

By Siva

కాలు నొప్పిగా ఉండటంతో, వైద్యులను సంప్రదించారు. సర్జరీ చేయాలి అని చెప్పడంతో, హాస్పిటల్లో జాయిన్ అయి సర్జరీ చేయించుకున్నాడు.

తాజాగా ఆయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ ద్వారా పంచుకున్నాడు.

సర్జరీ చేయించుకున్న తర్వాత కొంత ఉపశమనంగా ఉందని తన ఫేస్ బుక్ లో రాశాడు. ఇది చూసిన అభిమానులు తను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రేమదేశం అనే తమిళ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

2015లో సినిమాలకు దూరమై విదేశాలకు వెళ్ళి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నాడు.

ప్రేమదేశం సినిమాతో 90వ దశకంలో కుర్రకారుల ఫేవరెట్ హీరోగా మారిన అబ్బాస్.

ప్రియా- ఓ ప్రియా, రాజా, కృష్ణ బాబు, అల్లుడుగారు వచ్చారు, నీ ప్రేమకై వంటి అనేక సినిమాలలో నటించాడు