రష్మిక సినిమాలను బ్యాన్ చేయబోతున్న కన్నడ పరిశ్రమ.

By Siva

కన్నడ చిత్ర పరిశ్రమలో పార్టీ కిర్రిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రష్మిక మందన.

టాలీవుడ్లో చలో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

టాలీవుడ్లో పెద్ద స్థాయికి ఎదిగిన రష్మిక, మాతృభాష కన్నడ గురించి, కన్నడ సినిమాల గురించి తను మాట్లాడిన మాటలు ఎంతగానో వైరల్ అయ్యాయి.

చాలా భాషలలో మాట్లాడడానికి ఎంతో సులువుగా ఉంటుంది. అయితే తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడడం కష్టంగా ఉంటుందని చెప్పింది.

కన్నడ ఇండస్ట్రీలో భారీ సంచలనాన్ని సృష్టించిన కాంతార సినిమా చూడటానికి టైం లేదని కామెంట్స్ చేసింది.

రిషబ్ కూడా తనదైన స్టైల్ లో రష్మికకు బుద్ధి చెప్పాడు.

కన్నడ పరిశ్రమ నుంచి వైదొలగించాలని, తన సినిమాలను బ్యాన్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు, సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

కన్నడ పరిశ్రమ తీసుకున్న నిర్ణయం నిజమని తెలిస్తే, దీని ప్రభావం రష్మిక నటించే పాన్ ఇండియా సినిమాలపై భారీగా పడనుంది.

కిరిక్ పార్టీలో హీరోగా నటించిన రక్షిత్ రిషబ్ శెట్టి తమ్ముడు.

రష్మిక, రక్షిత్ ప్రేమించుకుని, ఎంగేజ్మెంట్ చేసుకొని, కొన్ని రోజుల తర్వాత క్యాన్సల్ చేసుకున్నారు.

అప్పటినుండి రష్మికకు, రిషబ్ కు మధ్య చిన్నపాటి గొడవలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

దీని కారణంగానే తను ఇలా మాట్లాడి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.