Allu Arjun: సినిమాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య
Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి గురించి అభిమానులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే అల్లు స్నేహారెడ్డి. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఇమేజ్ లను పోస్ట్ చేస్తూ…ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక స్నేహ రెడ్డి పోస్ట్ చేసే ఇమేజ్లను చూస్తూ వావ్ ఎంత అద్భుతంగా ఉంది.
హీరోయిన్లు కూడా తన అందం ముందు తక్కువే అనుకుంటున్న స్టైలిష్, ట్రెడిషనల్, ట్రెండ్ దుస్తులు ఇలా ఏది ట్రై చేసినా సూపర్ గా అనిపిస్తుంది. కొత్తగా కొన్ని రోజుల క్రితం సిల్వర్ కలర్ శారీలో అందాల రాసిగా మెరిసిపోయింది. ఈ మెదలను చూసినా నెటిజన్ లు.. హీరోయిన్ కన్నా సూపర్ గా ఉన్నారు మేడమ్ అంటూ తెగ రిప్లై ఇచ్చారు. అంతేకాక అల్లు అర్జున్ మీరు ఇద్దరూ మోస్ట్ స్పెషల్ కపుల్ ఆఫ్ టాలీవుడ్ అంటూ ప్రశంసలు ఇచ్చారు. ఇక కొందరైతే ఏకంగా మేడం మీరు కూడా సినిమాల్లోకి హీరోయిన్ గా రావచ్చు కదా అని అడిగారు.
ఈ క్రమంలో కొత్తగా సోషల్ మీడియా ఫిలిం నగర్ లో వార్త జోరుగా వినిపిస్తుంది. అదేంటంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో అల్లు స్నేహారెడ్డి…సినిమాల్లోకి వస్తున్నారు అంటూ జోరుగా ప్రచారం కొనసాగుతుంది.
అసలు ఈ న్యూస్ నిజమేనా తెలియక ముందే ప్రేక్షకులు మాత్రం హీరోయిన్ పాత్రలు వద్దండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అంతేకాక స్నేహ రెడ్డి సినిమాలలోకి వస్తున్నారు కానీ అది టాలీవుడ్ లోకి కాదు మలయాళం లోకి అంటూ మరో వార్తలు అల్లు అర్జున్ కి మలయాళం లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు స్నేహారెడ్డి మలయాళంలోకి ఎంట్రీ అవుతున్నారంటూ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.
కానీ కొంతమంది నెటిజెన్లు మాత్రం ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే ఆమె సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ వన్ పర్సెంట్ కూడా లేదంటున్నారు. ఇక అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లకు 2011, మార్చి 6న మ్యారేజ్ జరిగింది. ఈ ఏడాదితో మీరే వివాహ బంధానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక వీరిద్దరి ది లవ్ మ్యారేజ్. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కూతురు అర్హ, కొడుకు అయాన్ ఉన్నారు.