ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సమంత

నేడు సమాజంలో సోషల్ మీడియా వల్ల లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు అంతే ఉన్నాయి. పేస్ బుక్ ప్రేమ ఒక యువతి కుటుంబాన్ని విషాదంలో పెట్టింది.వివరాల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన ఎస్. సమంత,పశ్చిమగోదావరి జిల్లా తణుకు సంబంధించిన నవీన్ అనే వాళ్లు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది.

ఇలా తమ ప్రేమను ఇంట్లో వాళ్లకి చెబితే కోప్పడతారని,మరియు ఒప్పుకోరని భావించిన సమంత ఎనిమిది నెలల క్రితం ఇంట్లో వారికి చెప్పకుండా నవీన్ వద్దకు వెళ్ళిపోయింది. నవీన్, సమంత ఇద్దరు ద్వారకా తిరుమల లోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.అలాగే తణుకు పోలీసులకు తమ ప్రేమ వ్యవహారం తెలిపి తమ ఇరువురు మేజర్ల మని పెళ్లికి చట్టబద్ధ ఉందని తెలిపారు.

తర్వాత పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సమంతను నవీన్ ఇంటికి పంపారు. ఇలా వీరి సంసారం రెండు నెలలు సాఫీగానే జరిగింది. అయితే క్రమంగా నవీన్ లోని కసాయితనం బయటపడడం మొదలైంది.సమంతను కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇలా చేయడంతో సమంత ఇవన్నీ భరిస్తూ వచ్చింది.

ఇక ఆషాడ మాసం రావడంతో సమంత పుట్టిన ఊరు మంగళగిరి వచ్చింది. ఇంట్లోని వారికి తన భర్త యొక్క అసలు స్వరూపాన్ని చెప్పింది తన భర్త కట్నం కోసం,బంగారు కోసం తనను వేధిస్తున్నాడని మొరపెట్టుకుంది. అయితే సమంత తల్లి కూతురికి నచ్చజెప్పి అన్ని సర్దుకుంటాయని తెలిపింది.

ఈలోపే సమంత ఏం బాధ పడిందో ఏమో గాని ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే తను చనిపోతున్నానని మూడు రోజుల క్రితమే తన భర్త అయిన నవీన్ కి ఫోన్లో సందేశం పంపినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker