పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు..


సీఎం జగన్…

తాడేపల్లి: ప్రజలందరూ చల్లని దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘనవిజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ… ఈ ఫలితాలు, ప్రతి కుటుంబం ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
81 శాతం పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ 99% వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచారు అని తెలిపారు.

86 శాతం ఎంపీటీలు,98 శాతం జడ్పీటీసీ స్థానాలలో గెలిపించాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, కొన్ని శక్తులు ప్రయత్నించాయిన్నారు. ఆ న్యాయపు మీడియా సంస్థలు అబద్దాన్ని నిజం చేయాలని చేశారని అన్నారు. ప్రతిపక్షం ఓటమి కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటున్నారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలు రుణపడి ఉంటాననీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker