40 అంశాల అజెండాతో ఇవాళ AP క్యాబినెట్ మీట్.అమరావతి:ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 40 అంశాల అజెండాతో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక చర్చలు జరుగుతున్నాయి.

మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు మంత్రివర్గం. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపాదనలు చేయనుంది. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆధారిటీ ఏర్పాటుపై చర్చ జరుగుతుండగా.. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలు నిర్దేశించే అంశాలపై ఈ ఆధారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఈ తరహా అధారిటీ లు ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఆర్గానిక్ ఫార్మింగ్ గా గుర్తించిన సంస్థలు మాత్రమే ఉత్పత్తులు విక్రయించేలా కొత్త విధానం తీసుకురానున్నారు.

ఇక ఆసరా రెండో విడత మొత్తాన్ని విడుదల చేసే అంశానికి క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. గృహాలు మంజూరు అయిన లబ్ధిదారులకు 35 వేల అదనపు రుణాలు ఇచ్చే ప్రతిపాదనపై చర్చించనుంది క్యాబినెట్. ఆసుపత్రులు, స్కూళ్లు, పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం అందించే దాతల పేర్లను పెట్టేందుకు వీలుగా కొత్త విధానాన్ని తీసుకొచ్చి అంశంపై నిర్ణయం. విశాఖలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. బద్వేల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం లభించడం ఉండగా, శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనపై క్యాబినెట్ చర్చించనుంది. ఇక హోంగార్డుల నియామకంపై చర్చ జరుగుతుంది. ఇలా మొత్తం నలభై అంశాలపై క్యాబినెట్ అజెండా రూపొందించారు అధికారులు.స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker