పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్‌ 

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమమును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నంలో ఉంది. ఆగస్టు 1 నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తారని తెలిపింది. అనంతరం ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమంను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.


ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఈ విధంగా ఉండబోతుంది.
సమాజంలో డబ్బున్న ఉన్నత వర్గాలు వారి కుటుంబానికి రక్షణగా ఒక డాక్టర్ ని నియమించుకోవడం సహజం. ఆ కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చిన వారు వారు నియమించుకొన్న డాక్టర్ను సంప్రదిస్తారు.లేదా డాక్టర్ గారికి తెలిపితే ఆ డాక్టరే వచ్చి ఆ కుటుంబంలోని వారికి అవసరమైన వైద్య సహాయం చేస్తాడు. ఏదైనా వైద్య పరీక్షలకు అవసరమైతే వారి నమూనాలు లాబ్స్ కు పంపిస్తాడు. మరియు ఏదైనా సమస్య ఉంటే సంబంధించిన డాక్టర్ కు సిఫారసు చేస్తాడు. ఈ విధంగా సమాజంలో ఉన్నత వర్గాల వారు వారి యొక్క ఆరోగ్యం గురించి ఒక డాక్టర్ నియమించు కోవడాన్ని ఫ్యామిలీ డాక్టర్ అంటారు.

కానీ పేదలకు ఇలాంటి సౌకర్యం నేటి వరకు అందుబాటులో లేదు మరి వారు ఫ్యామిలీ డాక్టర్ ను నియమించు కోలేరు కాబట్టే ప్రభుత్వం వీరికి అండగా ఉండేందుకే ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్ట పోతుంది. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయం పరిధిలో ఇద్దరు డాక్టర్లను నియమించబోతుంది ఈ ఇద్దరు డాక్టర్లు సచివాలయ పరిధిగ్రామంలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతం ప్రతి సచివాలయంలో ఒక డాక్టర్ నియమిస్తారు అలాగే 104 వాహనాల్లో ఉన్న డాక్టర్ను గ్రామంలో పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు.

పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్‌ 
పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్‌ 


ఆగస్టు1 నుంచే ట్రయల్ రన్ ప్రారంభం కాబోతుంది:
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో భాగంగా 104 వాహనాల సంఖ్యపెంచడం జరుగుతుంది.వారంలో ఒకరోజు కాకుండా ప్రతి గ్రామంలో కూడా రోజు 104 వాహనం ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిని సమీక్షించాలని,అలాగే ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో కి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.దీనికి ప్రధాన కేంద్రాలుగా సచివాలయం ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది.సచివాలయానికి 104 వాహనాలు నెలలో రెండు సార్లు సార్లు వెళ్లే విధంగా ఆదేశాలు జారీ చేస్తారు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పల్లె ప్రజలకు సంబంధించింది. పట్టణాల్లోఅయితే వైయస్సార్ క్లినిక్ అందుబాటులో ఉన్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker