ఏపీ సీఎం కి హీరో విశాల్ ప్రశంసలుహీరో విశాల్ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై హీరో విశాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఏపీ సీఎం జగన్ కి హాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు.

సినిమా టికెట్లు బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి దీనికి సంబంధించిన ఒక జీవోను కూడా విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం పై ట్విట్టర్ వేదికగా స్పందించిన హీరో విశాల్. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసలు కురిపించాడు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమిళనాడులో కూడా అమలు చేయాలని అని ఆ రాష్ట్ర సీఎం ను కోరారు.

ఏపీ లోని థియేటర్లలో ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని తీసుకొస్తున్న అందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హాట్సాఫ్ మేము ఇలాంటి విధానాన్ని తమిళనాడు లో పెడితే బాగుంటుందని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఇలాంటి విషయం జరగడం చాలా ఆనందం. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతించాలి. ఇలా చేస్తే 100% పారదర్శకత ఉంటుంది. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ గారు ఇలాంటి పద్ధతిని తమిళనాడులో కూడా తీసుకు రావాలని కోరుచున్నాను. అలా చేస్తే థియేటర్స్ కలెక్షన్ విషయంలో పారదర్శకంగా కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఇది ఒక వరమని విశాల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. సినిమా టికెట్ల విషయంలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు కొత్త పోర్టల్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్ల ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్రం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ సర్వీసు నడుస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker