ఆంధ్ర ప్రదేశ్ లోని ఇసుక అక్రమ రవాణా వ్యవహారం దుమారం రేపుతుంది. ఇసుక అక్రమ రవాణా లో అధికార వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు కష్టం ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏకంగా ఒక మంత్రి ఇ ఇసుక అక్రమ రవాణా అని ప్రోత్సహిస్తున్నారని వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు అక్రమ ఇసుక రవాణా వివాదంలో చిక్కుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను వదిలేయాలని ఒక ఎస్సైని బెదిరించారు అన్న ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వైసీపీ నేతల ఇసుక అక్రమ రవాణా నిజమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్థానిక పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను మంత్రి జయరాం ను ఆశ్రయించగా, ఎస్ఐ కి ఫోన్ చేసి పట్టుకుని ట్రాక్టర్ను వదిలేయాలని ఎస్సై కి హుకుం జారీ చేశారు. ఇల్లీగల్ గా వద్దు లీగల్ గా ఇసుక రవాణా చేసుకోవాలన్న ఎస్సై పై మంత్రి సీరియస్ గా అయ్యారు. పట్టుకుని సీజ్ చేసిన ట్రాక్టర్లను వదిలేయకు ఉంటే తానే ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. నాకు జనాలు కావాలి, సేఫ్టీ కావాలి.. మరోసారి నేను పోటీ చేసేదు. నేను గెలిస్తేనే ఈడ యవ్వారం అయ్యేదు.. నేనే ధర్నాకు దిగాలా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
ఆడియో లీక్ అవడంతో మంత్రి జయరాం కనుపాపలోని ఆలూరు నియోజకవర్గం ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపణలు బలం చేకూరినట్లు ఉంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఇసుక సరఫరా చేస్తున్నామని చెప్తుంటే మంత్రి అక్రమ రవాణా విషయంలో పోలీసుల బెదిరించడం పై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం పై మంత్రి జయరాం గారు స్పందించారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇసుక రీచ్ లేవని అలాంటప్పుడు ఇసుక అక్రమ రవాణా ఇలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది అంతా అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు.