పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి తానేటి వనిత
AP:రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు
శనివారం కొవ్వూరు మండలం లోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇ మాట్లాడుతూ.. తూ, ఐ. పంగిడి గ్రామంలో రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.
రూ.198 లక్షలతో నిర్మించిన ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. దేచేర్ల గ్రామంలో లో రూ.124.80 లక్షలతో చేపడుతున్న సిసి రోడ్లు, శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి గారు పాల్గొన్నారు. రహదారులను నాణ్యత పరిమాణాలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది.
కొవ్వూరు ఐ. పంగిడి గ్రామంలో మండలం లోని రహదారులను విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొని వచ్చామన్నారు. ఐపంగిడి గ్రామంలో ప్రజల అవసరాల కోసం మరో విద్యుత్ సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నట్లు తెలిపారు.
ఈ ప్రాంతంలో క్వారీలు ఉన్నాయని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది.
ప్రజాధనంతో చేపడుతున్న వాటి నిర్వహణ లో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.