Varalakshmi vratham:వరలక్ష్మీ వ్రతం కథ

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని హిందువులు జరుపుకుంటారు. భక్తిశ్రద్ధలతో వేడుకుంటే వరాలిచ్చే తల్లి వరలక్ష్మి దేవి. వరలక్ష్మీ వ్రతానికి నిష్టలు నియమాలు, ముడులు అవసరం ఉండదు. భక్తితో ఏకాగ్రతతో పూజ ఆచరిస్తే చాలు. వరలక్ష్మీ వ్రతం మంగళకరమైనది. వరలక్ష్మీ వ్రతం చేయటం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం, సకల శుభాలు, కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 

వరలక్ష్మి దేవి పేరులో వర అంటే శ్రేష్టమైన అని అర్థం. లక్ష్మీదేవి అంటే సంపదలనిచ్చే తల్లి అని అర్థం. సంపద అంటే కేవలం ధనం ఒక్కటే కాదు దన సంపద, పశువు సంపద, జ్ఞాన సంపద అలాంటివి ఎన్నో ఉన్నాయి.

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని చేయాలి. ఆ రోజు వీలు కాకపోతే మరుసటి శుక్రవారం కూడా చేసుకోవచ్చు. శుక్రవారం వ్రతం చేయడం ద్వారా సకల పాపాలు తొలగి లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలుగుతాయని హిందువులు విశ్వసియంగా నమ్ముతారు.

పూర్వం శౌనాకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి వరలక్ష్మీ వ్రత కథను గురించి చెప్పాడు.

స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాన్ని శివుడు పార్వతి దేవికి చెప్పాడు. లోక ఉపకారం కోసం ఈ వ్రతం గురించి మీకు నేను వివరిస్తాను వినండి అన్నాడు.

పరమశివుడు తన సింహాసనమైనా భస్మసింహాసనంపై కూర్చొని ఉంటాడు. నారద మహర్షి , ఇంద్రాది,దీపాలకులు స్తుతి స్తోత్రాలతో శివున్ని కీర్తిస్తూ ఉంటారు. శివుడు ఆనందంలో మునిగితేలుతూ ఉన్నప్పుడు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరున్ని నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పవిత్ర వృద్ధిగా ఉండటానికి తగిన ఒక వ్రతం చెప్పండి అనే శివుని వేడుకుంటుంది. అప్పుడు పరమశివుడు దేవి నువ్వు కోరుకున్నట్లుగానే స్త్రీలు సర్వసౌక్యాలతో, సకల శుభాలు కలిగించే వ్రతం ఉంది ఆ వ్రతం వరలక్ష్మీ వ్రతం దానిని శ్రావణమాసంలో రెండో శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.

శివుడు పార్వతికి వరలక్ష్మీ వ్రతం గురించి వివరించడం: పార్వతీదేవి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు వ్రతాన్ని ఎలా చేయాలో వివరించమని కోరుకుంటుంది. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం బంగారు ఉద్యములతో రమణీయంగా ఉంటుంది. ఆ పట్టణంలోనే చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కల సుగుణవతి.ప్రతిరోజు వేకువ జామున నిద్రలేచి భర్త పాదాలను పూజించి ఇంటి పనులు పూర్తిచేసుకుని అత్తమామలకు సేవ చేస్తూ తరిస్తూ ఉండేది. 

వరలక్ష్మి అనుగ్రహం: వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మి దేవి ఒకరోజు రాత్రి చారుమతికి కలలో కనిపించి శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నేను నువ్వు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అదృశ్యం అవుతుంది. వరలక్ష్మీ మాత నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా, విద్వాంసులుగా, పేరు ప్రఖ్యాతలు పొందుతారు.  నా పూర్వజన్మ పుణ్యం వల్ల నీ దర్శనం నాకు కలిగింది. అని అనేక రకాలుగా వరలక్ష్మీ దేవిని ప్రార్థించింది.

అంతలో మేలుకో వచ్చి చారుమతి లేచి చూసి ఇదంతా కలగా గుర్తించి. తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు వివరిస్తుంది. వారు లక్ష్మీదేవి మనల్ని కటాక్షించిందని, సంతోషించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని అంటారు. చారుమతికి వచ్చిన కలను గురించి తెలుసుకొని వారు కూడా రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూశారు. ఆరోజు రానే వచ్చింది. ఆ పట్టణంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి, తలారా స్నానం చేసి, పట్టు వస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి వెళ్లారు.

చారుమతి తన ఇంటిలోనే మండపం ఏర్పాటు చేసుకుని ఆ మండపంపై బియ్యం పోసి, రావి, జువ్వి మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం తయారుచేసుకొని వరలక్ష్మి దేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ప్రతిష్టించింది.

అమ్మవారిని పూజించడం: అమ్మవారిని 16 ఆచారాలతో పూజించి భక్ష బొజ్జలను నివేదించారు. తొమ్మిది పోవుల తోరణాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షణ చేయగానే కాలి గజ్జలు గళ్ళు గళ్ళున మ్రోగాయి. రెండో ప్రదక్షణ చేయగానే చేతులకు నవరత్న  కంకణాలు దగదగా మెరిసాయి. మూడో ప్రదక్షణ చేయగానే అందరూ సర్వ భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి ఇల్లే కాక ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధనంతో బంగారంతో ,వస్తువులతో, వాహనాలతో నిండిపోయాయి వారు ఇంటికి గజతరగ రథ వాహనాలతో ఇళ్లకు వెళ్లారు.

ఆ పట్టణం లోని స్త్రీలు ఇండ్లకు వెళుతూ చారుమతిని పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి దేవి కలలో కనిపించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమను కూడా ధనవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతిఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనం, గడిపి ముక్తిని పొందారని పరమశివుడు పార్వతి దేవికి వివరిస్తాడు.

మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని  మీకు వివరించాను. ఈ కథ విన్నా, వ్రతం చేసిన ,ఈ వ్రతం చేసినప్పుడు చూసిన ,సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు ఆయురారోగ్యాలు ,ఐశ్వర్యాలు ,సిద్ధిస్తాయని సూత మహాముని శౌనాకాది మహర్షులకు చెప్పారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker