AP SSC : 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

AP SSC : 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

జూలై-2022, ,AP SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మరియు బెటర్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత ఫలితాలు & స్కూల్ వారీగా ఫలితాలు విడుదల

విజయవాడ M.G రోడ్‌లోని లెమన్ ట్రీ హోటల్‌లో గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు మరియు అధికారులు కలిసి ఫలితాలను విడుదల చేశారు. అతితక్కువ కాలంలోనే ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.

AP SSC RESULTS



ఈ ఇయర్ లో మార్కుల రూపంలో AP SSC-2022 ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ SSC పరీక్షలు 6 జూలై, 2022 నుండి 15 జూలై, 2022 వరకు నిర్వహించారు. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు‌.

అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ resultsbse.ap.gov.in లో చూసుకోవచ్చు.

10వ తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి.
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

టెన్త్‌ సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.. 191800 మంది పరీక్షలు రాశారు. బాలురులో పాసైన వారి సంఖ్య 66458 ఉత్తీర్ణతా శాతం 60.83 శాతం.

పాసైన బాలికల సంఖ్య 56678. ఉత్తీర్ణత శాతం 68.76 శాతం. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు.