AP Teacher News

జగనన్న విద్యాదీవెన షెడ్యూల్ విడుదల

జగనన్న విద్యాదీవెన షెడ్యూల్ విడుదల

జగనన్న విద్యా దీవెన పథకం మూడో విడత నిధుల మంజూరుకు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కసరత్తు చేయాలని ఆదేశించారు.

షెడ్యూల్ ప్రక్రియ:

-అక్టోబర్ 28, 29 తేదీలలో విద్యా దీవెన పథకానికి అర్హత గల విద్యార్థుల జాబితాను సచివాలయంలో పొందుపరచాలి. అనర్హుల జాబితాను ఆరు దశల్లో ధృవీకరించాలి.

-లబ్ధి పొందిన వారు తమ ఖాతాలో జమ అయిన నగదును కళాశాలలకు చెల్లించేలా అవగాహన కల్పించాలి.

-నవంబర్ 5వ తేదీన అర్హులు ,అనర్హుల జాబితాలను ఆయా సచివాలయంలో ప్రదర్శించాలి. అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి.

-నవంబర్ 6వ తేదీన 4 నోటీసులు జారీ చేయాలి.

-నవంబర్ 10వ తేదీ లోపు అర్హులైన విద్యార్థుల తల్లుల నుంచి బయోమెట్రిక్ నమోదు చేయించాలి అలాగే ఆయా కళాశాలల నుంచి విద్యార్థులు చదువుతున్నట్లు ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి.

-నవంబర్ 11వ తేదీ లోపు అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రిమార్కులను లాగిన్లో పొందుపరచాలి.

ఫీజులు చెల్లించకుంటే విద్యాదీవెన కట్:

జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రభుత్వం అందించే నగదు విద్యార్థులు ఆయా కళాశాలల్లో చెల్లించాలి లేకుంటే తదుపరి వసతిదీవెన, విద్యాదీవెన వారికి కట్ చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ వారు తెలిపారు. జగనన్న విద్యా దీవెన ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు, తల్లులు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా బయోమెట్రిక్ వేయాలన్నారు. ఈ సంవత్సరం రెండో విడత జగనన్న విద్యా దీవెన తీసుకున్న తల్లులు వెంటనే ఆయా కళాశాలల్లో మొత్తాన్ని చెల్లించాలని తెలిపారు. ఇంకా కాలేజీలకు ఫీజు చెల్లించని తల్లులకు అవగాహన కల్పించి, వెంటనే చెల్లించే బాధ్యత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిదే అని తెలిపారు.