AP Teacher News

jagananna vasathi deevena: విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అమ్మ ఒడి, వసతిదీవెన కు బదులుగా

విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అమ్మఒడి, వసతి దీవెన కు బదులుగా

-ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయం
-టెండర్ నోటీసు జ్యుడీషియల్ ప్రివ్యూకు
-ఆసక్తి చూపిన ఆరు లక్షల మంది

కరోనా సమయంలో ఆన్లైన్, డిజిటల్ బోధనకు ప్రాధాన్యత పెరగటం వలన ఉన్నత విద్యలో సాంకేతిక అవసరాలు దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అప్పు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి జూన్ లో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం జరిగింది‌. అయితే విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవడంతో అడ్మిషన్లు, ల్యాప్ టాప్ ఎంపిక ప్రక్రియ కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం పలురకాల పథకాలను అమలు చేస్తుంది. పాఠశాల విద్యార్థులకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి 14 వేల రూపాయలు వారి తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది మరియు కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల హాస్టల్ ఫీజు కోసం జగనన్న వసతి దీవెన పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 20 వేల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకాలకు బదులు విద్యార్థులు కావాలనుకుంటే ల్యాప్ టాప్ లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

Read more: Ammavodi eligibility: అర్హత గలవారికి మాత్రమే అమ్మ ఒడి

రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో అమ్మఒడి, వసతి దీవెన లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఈ పథకాల్లో అందించే నగదు కు బదులు ల్యాప్టాప్లను ఎంచుకునే ఆప్షన్ విద్యార్థులకు ఇచ్చారు. వాటి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా వివరాలు సేకరిస్తూనే ల్యాప్ టాప్ కొనుగోలుకు టెండర్ నోటీస్ జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ల్యాప్ టాప్ కొనుగోలు టెండర్లు 100 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్ నోటీస్ లోని అంశాలను న్యాయసమీక్షకు పంపించారు. ఏ పనులైనా, టెండర్ లైన 100 కోట్లు దాటితే జ్యుడీషియల్ ప్రివ్యూ ద్వారా పునః సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాప్ టాప్ ఆప్షన్ నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్యను బట్టి ఆరున్నర లక్షల పరికరాలకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో బేసిక్ కాన్ఫిగరేషన్ తో ఐదు లక్షల అరవై రెండు వేల ల్యాప్ టాప్ లు, ఆధునిక కాన్ఫిగరేషన్ తో 90 వేల 926 ల్యాప్ టాప్ లు కొనుగోలు చేయాలని నిర్ణయించి అందుకోసం టెండర్లు పిలవడం జరిగింది.

ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించేందుకు సిద్ధం అవుతుంది. అందులో భాగంగానే సరఫరా చేసే సంస్థలు బిడ్లు దాఖలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఆహ్వానించడం జరిగింది. అలాగే టెండర్, బిడ్ల విషయంలో ఏవైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వుంటే తెలియజేయాలని ప్రజలను కోరుతూ ప్రకటన విడుదల చేశారు. సలహాలు, సూచనలు అభ్యంతరాలు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల APJUDICIALPREVIEW@GMAIL.COM కు మెయిల్ ద్వారా తెలపాలని కోరారు.

ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే బేసిక్, అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ల్యాప్ టాప్ లు ఏవైనా లోపాలు వస్తే సరఫరా చేసిన కంపెనీల ద్వారా నే వాటికి పరిష్కారం చేసేలా ప్రభుత్వం నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. లాప్టాప్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కు సంబంధించిన లోపాలను గుర్తిస్తే వెంటనే ఆ విద్యార్థులు తనకు సమీపంలో ఉన్న లేదా సంబంధిత గ్రామ, వార్డు సచివాలయం లో ఫిర్యాదు చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయం నుంచి సంబంధిత కంపెనీలకు సమాచారం వెంటనే అందించేలా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఫిర్యాదు అందిన వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. అలాగే లాప్టాప్ లకు ఈ సంస్థలు అదనపు వారంటీ కల్పించాలని ప్రభుత్వం నిబంధనలు రూపొందించడం జరిగింది.