andhra pradesheapcetnotification

AP ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల నోటిఫికేషన్

AP ఇంజినీరింగ్ ప్రవేశాలు అక్టోబర్ 25 నుంచి

ఈ సంవత్సరం నుంచి ప్రైవేటు వర్సిటీలో ను 35 శాతం కన్వీనర్ కోటా ఇవ్వనున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు పై స్పష్టత లేదు.

ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సోమవారం జరగనున్న ఉన్నత విద్యా మండలి సమావేశంలో ఈ అక్టోబర్ 25వ తేదీ నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం తీసుకుంటారని సమాచారం. AP లో 17 ప్రభుత్వం, 305 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 1,55,000 సీట్లు ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ఎం ఎన్ఆర్ఎం, విట్,గీతమ్స్ లాంటి ప్రైవేటు విశ్వవిద్యాలయం 35 శాతం సీట్లను ప్రభుత్వమే భర్తీ చేయనుంది తొలిసారి ప్రారంభించిన ఈ విధానం వల్లే అడ్మిషన్లు కొంత ఆలస్యం అయ్యాయి. ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఫీజు నిర్వహిస్తేనే మొత్తం ఇంజనీరింగ్ సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీళ్లు ఉంటుంది. ఒక్కో కళాశాలకు ఆయా కళాశాల స్థాయి సౌకర్యాలను మేరకు ఫీజు నిర్వహిస్తారు. అదే పద్ధతిలో ప్రైవేట్ యూనివర్సిటీ లో పెట్టిన కన్వీనర్ కోటా ఫీజు నిర్ణయించాల్సి ఉంది. ఫీజు నిర్ణయించాలి అంటే ఆయా విశ్వవిద్యాలయాల నిర్వాహకులతో మాట్లాడడం, నిర్ణయించిన ఫీజుపై ఆలోచించుకునేందుకు వారికి చట్ట ప్రకారం 15 రోజులు గడువు ఇవ్వాలి. ఇలా ఆలస్యం కావడంతో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ నోటిఫికేషన్ కూడా ఆలస్యమైంది. సెప్టెంబర్ 8వ తేదీ ఈ ఏపీసెట్ ఫలితాలు వచ్చినా ఇప్పటి వరకు అడ్మిషన్ల కు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ ప్రక్రియ ముగించి అడ్మిషన్లకు ఈ నెల 25న నోటిఫికేషన్ ఇవ్వనున్నారని తెలిసింది. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరోవైపు ఈ ఏడాది ఇంటర్ మార్కుల ఆధారంగా కాకుండా పూర్తిగా ఈఏపీసెట్ ర్యాంక్ ఆధారంగా ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ సీట్ల భర్తీ చేయనున్నారు. కోవిడ్ కారణంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండానే మార్కులు ఇవ్వడం వల్ల ఈసారి ఈ ఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

అగ్రి హార్టికల్చర్ వెటర్నిటీ కోర్సులకు అక్టోబర్ 26 వరకు గడువు

వ్యవసాయం, హార్టికల్చర్, వెటర్నిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 26 వరకు గడువు పొడిగించారు. ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సీట్ల భర్తీ కౌన్సిలింగ్ చేపట్టింది. వాస్తవానికి నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన ఆగడు మూవీ ముగియనుండడంతో ఈ నెల 26 వరకు గడువు పొడిగించారు ఈ సీట్ల భర్తీ కూడా ఆన్లైన్లో దరఖాస్తులు, కౌన్సెలింగ్ ద్వారానే జరుగుతుంది. మరోవైపు ఈ మూడు అంశాలకు సంబంధించిన డిగ్రీ,తత్సమాన కోర్సుల్లో ఎన్ఆర్ఐఆర్ కోటాకు మాత్రం 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ డిగ్రీ కోర్సులను ఈ ఆన్లైన్ అడ్మిషన్లు భర్తీ చేస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button