andhra pradeshscholarship
AP ఉపకార వేతనాల గడువు పెంపు నవంబర్ 5
AP ఉపకారవేతనాల గడువు నవంబర్ 5
గుంటూరు: 2021- 2022 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లో ఉపకార వేతనాలు పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, obc, కాపు, మైనార్టీ, దివ్యాంగుల కేటగిరీల విద్యార్థులు నవంబర్ 5 లోపల దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డి. మధుసూదన్ రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను ప్రిన్సిపల్, యాజమాన్యం వారి కళాశాల లాగిన్ లో నమోదు చేసుకోవాలని కోరారు. విద్యార్థులు వివరాలను సరి చేసుకుని 7రోజుల లోపల బయోమెట్రిక్ ద్వారా నిర్ధారణ చేసి సంక్షేమ అధికారుల లాగిన్ లకు ఉపకారవేతనాలు మంజూరు కోసం ఓటీఏతో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.