andhra pradeshcounselling

AP ఎయిడెడ్ ఉపాధ్యాయుల విలీనం

AP ఎయిడెడ్ ఉపాధ్యాయుల విలీనం

AP AIDED స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులును ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులను దగ్గర లో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో ఈనెల 31 లోపు సర్దుబాటు చేయనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక సమ్మతి తీసుకొని సర్దుబాటు చేస్తారు.ఉపాధ్యాయులు నవంబర్ 7 న ప్రభుత్వ పాఠశాలలో చేరాల్సి ఉంటుంది. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయిలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను 20 నుంచి 22వ తేదీ వరకు రూపొందిస్తారు. అభ్యంతరాల స్వీకరణకు 23న జాబితాను సిద్ధం గా ఉంచుతారు. సీనియారిటీ జాబితాల పై 24 నుంచి 27వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.31న తుది జాబితా ప్రదర్శిస్తారు. నవంబర్ 1న యాజమాన్యాలవారీగి ఖాళీలను అందుబాటులో ఉంచుతారు. రాష్ట్రస్థాయిలో 2 నుంచి 5వ తేదీ వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదు, 6న నియామక ఉత్తర్వులు ఇస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button