AP Teacher News

AP జగనన్న అమ్మబడికి హాజరు 75 శాతం తప్పనిసరి

జగనన్న అమ్మబడికి హాజరు 75 శాతం తప్పనిసరి

జగనన్న అమ్మ ఒడి పొందాలంటే విద్యార్థులకు కచ్చితంగా 75 శాతం హాజరు కలిగి ఉండాల్సిందేనని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ పేర్కొన్నారు. సలహాదారుడు మురళితో కలిసి గురువారం విద్యాశాఖ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. జూన్ లో అమ్మ ఒడి అమలు చేస్తామన్నారు. విద్యార్థుల హాజరు నమోదు గణించడానికి నవంబర్ 8వ తేదీ లోపు బయోమెట్రిక్ విధానం సిద్ధమవుతున్నారు. మనబడి నాడు-నేడు మొదటి దశలో పనులకు కు పాఠశాల నుంచి నాబార్డు కాంట్రాక్టర్లకు నేరుగా బిల్లులు చెల్లించాలన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం లో లబ్ధిదారుల పిల్లలు 75 శాతం పాఠశాలల్లో హాజరును లింకేజి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రిమండలి సమర్థించింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది పాఠశాల పున‌ ప్రారంభమైన నవంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 ప్రమాణికంగా 130 రోజులుగా నిర్ణయించింది. ఇందులో 75 శాతం హాజరును పరిగణంలోకి తీసుకుని వచ్చే ఏడాది జూన్లో పాఠశాలల పునఃప్రారంభం లోగా లబ్ధిదారులకు అందజేసేందుకు మంత్రివర్గం సమావేశం సానుకూలంగా సమర్ధించింది.