AP జూనియర్ కళాశాలలో బదిలీలు
AP జూనియర్ కళాశాలలో బదిలీలు
బోధన, బోధనేతర సిబ్బందికి స్థాన చలనం
నెల్లూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో శుక్రవారం బదిలీలు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు బోధనేతర సిబ్బంది సంఘ రాష్ట్ర పబ్లిసిటీ కార్యదర్శి నిమ్మల సుబ్బయ్య గౌడ్ తెలిపారు. జిల్లాలో సీనియర్ అసిస్టెంట్లు విభాగంలో వెంకటగిరి కళాశాలకు చెందిన గంగాభవాని గూడూరు కు, సుళ్లూరు పేటకు చెందిన సుబ్బలక్ష్మి నెల్లూరు కెఏసీకి, గూడూరు లోని జంగాల అశోక్ కుమార్ కొవ్వూరుకు, కుల్లూరు కు చెందిన నాగేశ్వరరావు చేజర్ల కు, దగదర్త లోని సురేష్ ఇనమడుగుకు, నెల్లూరు కెఏసీలోని ప్రతాపరెడ్డి ఆత్మకూరు, ఇనమడుగు కు చెందిన సుబ్రహ్మణ్యం దగదర్తకీ,డీవీఈ కార్యాలయంలోని శ్రీకాంత్ విడవలూరు కాలేజీ కి బదిలీ అయ్యారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ల విభాగంలో వెంకటగిరికి చెందిన గోపాలకృష్ణయ్య మనుబోలుకు, పొదలకూరు కు చెందిన అమరేశ్వరి నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలకు, మనుబోలు లోని బాలాజీ పొదలకూరు, నెల్లూరు డీకే డబ్ల్యూ్లోని లక్ష్మి వెంకటగిరికి ప్రభుత్వ కళాశాల కు బదిలీ అయినట్లు తెలిపారు. రికార్డింగ్ అసిస్టెంట్లకు, ఆఫీస్ సబార్డినేట్ లకు, క్లాస్ పోర్ ఉద్యోగులకు త్వరలో బదిలీల కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ బదిలీలను ఆర్జేడీ పద్మ, నెల్లూరు డీవీఈవో ఏ శ్రీనివాసులు, RJD కార్యాలయం ఏవో శ్రీనివాస్ విఠల్ పర్యవేక్షించారు అని తెలిపారు.