AP Teacher News

AP డిగ్రీలో మేనేజ్మెంట్ సీట్లు 30 శాతం

AP డిగ్రీలో మేనేజ్మెంట్ సీట్లు 30 శాతం

డిగ్రీ కోర్సుల్లో 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ విభాగానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జీవో 55 ద్వారా ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర గురువారం విడుదల చేశారు. ప్రైవేటు, అటానమస్ డిగ్రీ కళాశాలలో సీట్లను కన్వీనర్, మేనేజ్మెంట్ కింద విభజించింది.

గత విద్యా సంవత్సరం డిగ్రీ కోర్సులో అడ్మిషన్ లను ఇప్పటికీ ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఉన్నత విద్యా మండలి నిర్వహించింది. ఇప్పుడే విద్యాసంవత్సరం నుంచి మేనేజ్మెంట్, కన్వీనర్ సీట్లు విధానం డిగ్రీలో అమలుకానుంది. సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి విడుదల చేస్తుంది కన్వీనర్ కోటా కింద 70 శాతం, మేనేజ్మెంట్ కింద 30 శాతం సీట్లను డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్(2020) కు అనుగుణంగా ఉన్నత విద్యా మండలి భర్తీ చేస్తుంది. కన్వీనర్ కోటా సీట్లకు ఫీజును ఏపీ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషనర్ నిర్ధారిస్తుంది. ఈ సీట్లకు నిర్ణయించిన ఫీజు కు మూడు రెట్లు మేనేజ్మెంట్ సీట్లకు వసూలు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ వర్తించవు.