ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూలును విద్యాశాఖ వారు గురువారం జారీ చేశారు.
ఉపాధ్యాయ ఖాళీలు:
గ్రేడ్-II ప్రధానోపాధ్యాయులు: 53
ఎస్ఏ-గణితం: 37
ఎస్ఏ-పీఎస్ : 15
ఎస్ఏ-బీఎస్: 49
ఎస్ఏ-ఆంగ్లం: 28
ఎస్ఏ-ఎస్ఎస్: 97
ఎస్ఏ-తెలుగు: 51
ఎస్ఏ-హిందీ: 37
ఎస్ఏ-ఉర్దూ : 01
ఎస్ఏ-సంస్కృతం: 11
ఎస్ఏ-పీడీ: 66
ఎస్ఏ-స్పెషల్ ఎడ్యుకేషన్: 11
ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు: 92
– 1-11-2020 తర్వాత ఏర్పడిన ఖాళీలను మాత్రమే ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు.
– జనవరి-21 లో నిర్వహించిన బదిలీల్లో బ్లాక్ చేసిన వాటిని చూపించారు.
-తాత్కాలిక ప్రాతిపదికన నిర్వహించనున్నారు.
-ఇప్పుడు పదోన్నతులు పొందేవారు కోరుకున్న స్థానాలను త్వరలో నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్లో ఖాళీలుగా చూపిస్తారు.
-పదోన్నతులు పొందే ఉపాధ్యాయులు బదిలీల కౌన్సెలింగ్లో పాల్గొని ఐచ్ఛికాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
జడ్పీ యాజమాన్య పాఠశాలల్లో ఖాళీలు 843.
-ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ 548.
-టీచర్లకు హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు.
షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యా శాఖ.
-16 నుంచి ప్రక్రియ ప్రారంభం.
అమరావతి:ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఆ శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు గురువారం విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు విద్యా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. స్టేట్ సబార్డినేట్ నిబంధనల ప్రకారం.. ఇప్పటికే డీఈవోలు జిల్లాల వారీగా సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసి పదోన్నతులకు వీలుగా అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలను రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవో కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందరికీ కనిపించేలా ఉంచాలి. హెచ్ఎం పోస్టులను ఆయా పేరెంట్ డిపార్ట్మెంట్లకు చెందిన టీచర్లకు పదోన్నతిపై కేటాయించాలి.
నవంబర్ 1 నాటికి పదవీ విరమణ చేసినవారి పోస్టులు, మరణించినవారి పోస్టులు, ఇతర ఖాళీలను పదోన్నతులకు వీలుగా చూపాలి.
2021 జనవరిలో నిర్వహించిన బదిలీల సమయంలో బ్లాక్ చేసిన, ప్రదర్శించినవాటిని ఖాళీల్లో చూపరాదు.
ప్రస్తుతం కల్పిస్తున్న పదోన్నతులన్నీ తాత్కాలిక (అడహాక్) ప్రాతిపదికపై ఉంటాయి.
బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో టీచర్లు,వారి ప్రతిభ, సాధించిన ఫలితాలు, ఇతర ప్రాతిపదికల ఆధారంగా ఇచ్చే ఆప్షన్ల ప్రాధాన్యతలను బట్టి పదోన్నతులు ఉంటాయి.
షెడ్యూల్
-స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ల సీనియార్టీ జాబితాల ప్రదర్శన అక్టోబర్ 16.
-సీనియార్టీ జాబితాలపై అప్పీళ్ల సమర్పణ అక్టోబర్ 18,19.
-అప్పీళ్ల పరిశీలన, పరిష్కారం అక్టోబర్ 21, 22..
-తుది సీనియార్టీ జాబితాల ప్రదర్శన అక్టోబర్ 23..
-పదోన్నతులకు కౌన్సెలింగ్ అక్టోబర్ 29 నుంచి 30 వరకు.