AP Teacher News

AP లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశం కొరకు ఆహ్వానం

AP లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కోర్సు లో ప్రవేశం కొరకు ఆహ్వానం

AP రాష్ట్రంలోని గుర్తింపు పొందిన మూడు సంస్థలలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సులో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఎస్కె పీఆర్ అహ్మద్ సూచించారు. మంగళవారం ఓ ప్రకటనలో విజయవాడలోని పీఎస్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, కడపలోని రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, గుంటూరులోని వావిలాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో 40 సీట్లు చొప్పున మొత్తం 120 తెలుగు, 120 ఆంగ్లం సీట్లు అందిస్తున్నాయని తెలిపారు. ఐదు మాసాల కాల వ్యవధితో కూడిన సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించి డిసెంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు రెండేళ్లు ఇంటర్మీడియట్ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి తత్సమానవిద్యార్హతలు కలిగి ఉండాలని తెలిపారు.