AP 11,425 Jobs in Health Department
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 11,425 ఉద్యోగాలు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 11, 425 ఉద్యోగాల భర్తీకి పరిపాలనాపరమైన ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. వీటిలో వైద్యులు పోస్టులను శాశ్వత విధానంలో భర్తీ చేస్తారు. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్లు, ప్లంబర్లు, ఇతర ఉద్యోగాలను ఒప్పంద పొరుగు సేవల కింద భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవీంద్ర ఉత్తర్వుల్లో తెలిపారు.
ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, బోధనాసుపత్రిలు, ఇతర ఆసుపత్రిలో ఈ నియామకాలు చేపడతారు. వీటిలో వైద్యు పోస్టులు సుమారు 1,900 వరకు ఉన్నాయి. ఒప్పందం, పొరుగు సేవల ఉద్యోగాలను జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీని నియమిస్తుంది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా శాఖల హెచ్ఓడిలు వైద్యుల నియామకం కోసం నోటిఫికేషన్ ఇస్తారు.