AP Teacher News

AP DEECET 2021 నోటిఫికేషన్ విడుదల

ఏపీ డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు DEECET 2021 నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DELED) కోర్సులో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ డైట్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సంస్థల్లో మొత్తం 5 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కోదానికి 25% సీట్లు ప్రత్యేకించారు.

అర్హతలు

గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో ఇంటర్ (మ్యాథమెటిక్స్ /ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ/ బోటనీ అండ్ జువాలజీ /సివిక్స్/ ఎకనామిక్స్/ హిస్టరీ/ జాగ్రఫీ/ కామర్స్) ఉత్తీర్ణత అయిన వారు అర్హులు. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకేషనల్ కోర్సులతో ఇంటర్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. దరఖాస్తు చేయు వారి వయస్సు సెప్టెంబర్ 1 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. మొత్తం మార్కులు 100. ఇందులో రెండు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్ 60 మార్కులకు ఉంటుంది. ఇందులో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, తెలుగు అంశాల నుంచి ఒక్కో దానిలో ఐదు ప్రశ్నలు, ఎంచుకున్న లాంగ్వేజ్( తెలుగు, తమిళం ,ఉర్దూ, ఇంగ్లీష్) మేథమేటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ అంశాల నుంచి ఒక్కోదానిలో 10 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ 6వ తరగతి నుంచి 10వ తరగతి సిలబస్ ప్రకారం ఉంటాయి. రెండో పార్ట్ లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ (మ్యాథమెటిక్స్/ ఫిజికల్ సైన్స్ /బయో సైన్స్/ సోషల్ స్టడీస్) నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఇవి ఇంటర్ మొదటి రెండవ సంవత్సరాల సిలబస్ ప్రకారం ఉంటాయి. పరీక్ష మాధ్యమంగా తెలుగు/ ఉర్దూ/ తమిళం/ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ను ఎంచుకోవచ్చు.DEECET అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులకు కనీసం 35%, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 25% మార్కులు రావాలి.

-దరఖాస్తు ఫీజు: రూ.600/-

-దరఖాస్తుకు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: అక్టోబర్ 14, 2021.

-దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 15, 2021.

-హాల్ టికెట్ డౌన్లోడింగ్: అక్టోబర్ 21

-AP DEECET 2021 పరీక్ష తేదీ: అక్టోబర్ 26, 27 తేదీలు.

-ఫలితాల విడుదల: అక్టోబర్ 29, 2021.

-కౌన్సిలింగ్ తేదీలు: నవంబర్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు.

-అధికారిక వెబ్సైట్: www.apdeecet.apcfss.in