degree

సెప్టెంబర్ 25 వరకు డిగ్రీ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు

సెప్టెంబర్ 25 వరకు డిగ్రీ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్ లోని నాన్ ప్రొఫెషనల్ యూజీ డిగ్రీ కోర్సులలో 2021-2022 విద్యా సంవత్సరం ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది ఈనెల 25 వరకు పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ గారు తెలియజేశారు. బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

ప్రత్యేక కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 23వ, 24 వ తేదీలలో నిర్ణీత కేంద్రాలలో తమ ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్ళవచ్చు. రాష్ట్రం మొత్తానికి 53 హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సవరించిన షెడ్యూల్

-దరఖాస్తు చివరితేది: సెప్టెంబర్ 25

-ప్రత్యేక కేటగిరీ దరఖాస్తు పరిశీలన: నెంబర్ 23వ, 24వ తేదీ లు

-వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ: సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు

-సీట్ల కేటాయింపు ప్రక్రియ: అక్టోబర్ 5వ తేదీ

-తరగతులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button