AP Engineering, Pharmacy Admission Schedule
ఏపీ లోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ (ఎంపీసీ స్ర్టీమ్) కళాశాలలో ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆన్లైన్లో ప్రవేశాల షెడ్యూల్ను విజయవాడలో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రైవేట్ విశ్వవిద్యాలయా లోను 35 శాతం సీట్లను వెబ్ కౌన్సిలింగ్ పరిధిలోకి తీసుకువచ్చాం. వాటికి కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. విద్యార్థుల ధ్రువపత్రాలను ఆన్లైన్తో పాటు జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన 25 హెల్ప్ లైన్ సెంటర్ పరిశీలిస్తాం. క్యాటగిరి – బి కింద యాజమాన్య కోటాలో భర్తీ చేస్తే 30 శాతం సీట్లు లో సగం ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా లో మిగిలిన సీట్లను మేనేజ్మెంట్ కోట తో కలిపి భర్తీ చేస్తామని వివరించారు.
కౌన్సిలింగ్లో భర్తీ చేయనున్న సీట్లు
ఇంజఫార్మసీ, ఫార్మా – డికి, సంబంధించిన 36 యూనివర్సిటీ కళాశాలలో 6,747 సీట్లు (ఈ డబ్ల్యూ ఎస్) కోటా కలిపి, 297 ప్రైవేట్ కళాశాలలో 72,529, నాలుగు ప్రైవేట్ వర్సిటీలో 2,330 సీట్లను భర్తీ చేస్తాం. మొత్తంగా కన్వీనర్ కోటాలో ప్రస్తుతం 81,597 సీట్లు అందుబాటులో ఉన్నాయి అని మంత్రి సురేష్ వెల్లడించారు.
ఇది షెడ్యూల్
ప్రవేశాల ప్రకటన : అక్టోబర్ 22
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు : 20 నుంచి 30 వరకు
ధ్రువపత్రాల పరిశీలన : 26 నుంచి 31 వరకు కోర్సులు కళాశాలలకు ఐచ్చిక ల ఎంపిక : నవంబర్ 1 నుంచి 5 వరకు
ఐచిక్కాలలో మార్పులకు అవకాశం : నవంబర్ 6
సీట్ల కేటాయింపు : నవంబర్ 10
కళాశాలలో రిపోర్టింగ్ : 10 నుంచి 15 వరకు తరగతులు ప్రారంభం : 15 నుంచి
ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు http://sche.ap.gov.in లో ఉంటాయి
సంప్రదింపుల కోసం మెయిల్ :Convenerape apcet2021@gmailcom
phone number : 8106876345, 8106575234, 7995865456
ముఖ్య గమనిక
ఏపీఈఏపీ సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, పదవ తరగతి, ఇంటర్ / సమాన విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితా తో పాటు నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు.