AP INTER Advanced Supplimentary Results Released
AP Inter Advanced Supplimentary Results Released
ఏపీ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రామకృష్ణ గారు శనివారం విడుదల చేశారు. కరోనా వలన పరీక్షను రద్దు చేసి, మొదటి సంవత్సరం విద్యార్థులు అందరినీ ఉత్తీర్ణులు చేయగా, రెండో సంవత్సరం వారికి మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులు 70 శాతం, పదో తరగతి మార్కులు 30 శాతంగా తీసుకొని కేటాయించారు. వీటిపై సంతృప్తి చెందని వారు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్రం మొత్తంగా 3,24,800 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడం జరిగింది. రెండో సంవత్సరానికి సంబంధించి 14,950 మంది మాత్రమే పరీక్షకు హాజరు అయ్యారు. గత సంవత్సరం మార్చిలో పరీక్ష ఫీజు చెల్లించిన వారికి ఈ పరీక్షలో మార్కులు పెరగకపోయినా గతంలో కేటాయించిన వాటిని ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ మెమోలను 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పున:లెక్కింపు, పరిశీలనకు నవంబర్ 2వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పునః లెక్కింపునకు ఒక్కో పేపరుకు 260 రూపాయల చొప్పున, పునఃపరిశీలన, స్కానింగ్ ఇచ్చేందుకు ఒక్కో పేపర్కు 1300 వందలు చొప్పున చెల్లించాలి.
Results
www.sakshieducation.com
http://bie.ap.gov.in
http://examresults.ap.nic.in
http://results.apcfss.in