AP Municipal Teacher Transfers Guidelines
మున్సిపల్ పాఠశాలలపై మార్గదర్శకాలు విడుదల
మున్సిపల్ పాఠశాలలో బదిలీలు సర్దుబాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ బదిలీలను ఆన్లైన్లో చేపడతారు. సెప్టెంబర్ 30 నాటికి ఉన్న విద్యార్థుల ఆధారంగా ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 ఏళ్ళు పనిచేసిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాలి. అక్టోబర్ 1కి రెండేళ్లు సర్వీస్ చేసిన వారు బదిలీ దరఖాస్తుకు అర్హులు.
పురపాలక సంఘం, నగరపాలక సంస్థ పరిధిలోనే వీరికి బదిలీలు నిర్వహిస్తారు.
ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు వరకు ఇద్దరు,
151 – 200 మంది ఉంటే ప్రధానోపాధ్యాయులు తో కలిపి 6 పోస్టులు ఇస్తారు.
200 మందికి మించితే ప్రతి 40 మందికి ఒకరు చొప్పున కేటాయిస్తారు. ఈ నిబంధనల ప్రకారం ప్రధానోపాధ్యాయులు మిగులు ఉంటే వారిని పని సర్దుబాటు కింద అవసరమైన పాఠశాలకు కేటాయిస్తారు.
150 మంది కంటే తక్కువ పిల్లలుఉన్నచోట ప్రధానోపాధ్యాయుడు పోస్టులు ఎస్జీటీ గా మార్పు చేస్తారు.
6, 7,8 తరగతులు ఉంటే 140 మంది వరకు ఆరుగురు,
386 – 420 పిల్లలు వరకు ఉంటే 15 పోస్టులు ఇస్తారు.
420 కంటే ఎక్కువ మంది పిల్లలున్న బడులకు ప్రతి 35 మందికి అదనంగా 6 సబ్జెక్టులకు టీచర్లను ఇస్తారు.
స్కూల్ అసిస్టెంట్ కొరత ఉంటే అర్హత కలిగిన ఎస్జీటి లను కేటాయిస్తారు.
ఉన్నత పాఠశాలలో 200 విద్యార్థుల వరకు 9 పోస్టులు 1,161 – 1,200 వరకు 44 మంది ఉపాధ్యాయులను ఇస్తారు. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొరత ఉంటే విద్యార్థుల తక్కువ ఉన్న ప్రాథమికోన్నత బడుల నుంచి సర్దుబాటు చేస్తారు.
1,200 మంది పిల్లలు కంటే ఎక్కువ ఉంటే ప్రతి 40 మందికి 7 గురు సబ్జెక్టు టీచర్ ను కేటాయిస్తారు.
బదిలీలు, సర్దుబాటు కు సంబంధించి ఆర్డీఎంఏ చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేస్తారు.