andhra pradeshcounsellingeapcet

APEAPCET 2021 Web Counseling

APEAPCET 2021 Web Counseling

ఏపీఈఏపీ సెట్ లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలో ప్రవేశానికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. వెబ్ కౌన్సిలింగ్ కు కాలేజీలో కోర్సుల వారీగా సీట్ల సంఖ్యను ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. ఈ మేరకు వేరెవ్వరు జీవోలను ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర విడుదల చేశారు. తొలిసారిగా యూనివర్సిటీల కాలేజీలు, ప్రవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీలతో పాటు ప్రవేట్ యూనివర్సిటీ లో 35 శాతం సీట్లను కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో తొలివిడత కౌన్సిలింగ్ కు1,45,421 ఇంజనీరింగ్ , ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అత్యధికం కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మెకానికల్, కెమికల్, సివిల్ వంటి కోర్ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఇంజనీరింగ్ , కోర్సులకు సంబంధించి మొత్తం 435 కాలేజీ కౌన్సిలింగ్ లో ఉన్నాయి.

నవంబర్ 2వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు చేయవచ్చు. 6వ తేదీ మార్పులు చేసుకోవచ్చు. 10వ తేదీన తొలి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధించిన కాలేజీలో ఈనెల 15 వ తేదీలోపు చేరాలి. అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

యూనివర్సిటీ కాలేజీ లోని ఇంజనీరింగ్ సీట్లు 5,901

ప్రైవేట్ కాలేజీలోని ఇంజనీరింగ్ సీట్లు 1,24,577

ప్రైవేట్ వర్సిటీలోని ఇంజనీరింగ్ సీట్లు 2,118

యూనివర్సిటీ కాలేజీలోని ఫార్మసీ సీట్లు 600

ప్రైవేట్ కాలేజీలోని ఫార్మసీ సీట్లు 12,225

Official website: Click here

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button