APPGECET-2021 Results released
APPGECET-2021 ఫలితాలు విడుదల
ఏపీలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి గతనెల 28 నుంచి 30 వరకు నిర్వహించిన ఏపీపీజీఈసెట్- 2021 ఫలితాలను ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ కే. రాజా రెడ్డి బుధవారం రాత్రి తన ఛాంబర్లో విడుదల చేశారు. ఈ ప్రవేశం పరీక్షలో 92.78 శాతం మంది అర్హత సాధించారని ఆయన చెప్పారు. 9,854మంది దరఖాస్తు చేయగా, 7,924 మంది ప్రవేశ పరీక్షలు రాశారు. వారిలో 7,354 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అర్హత సాధించిన వారిలో 3,854 మంది పురుషులు 3,498 మంది మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో లో ఏపీపీజీఈ సెట్ కన్వీనర్ ఆర్వీఎస్ సత్యనారాయణ, రిజిస్టర్ మహమ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు.
సబ్జెక్టు లో మొదటి ర్యాంకు సాధించిన వారు
బయోటెక్నాలజీలో వేల్లపు రెడ్డి కీర్తన (నెల్లూరు)
కెమికల్ ఇంజనీరింగ్ లో అరవ అఖిల్ (రాజమండ్రి)
సివిల్ ఇంజనీరింగ్ లో అయ్యప్పన్ యువరాజు (తెనాలి)
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో ఏడీ భార్గవి (నగరి, చిత్తూర్ జిల్లా)
ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ లో బి. వంశీ (నరసాపురం)
ఈసీఈ లో షేక్ మహమ్మద్ షరీఫ్ (కలసపాడు, వైఎస్ఆర్ జిల్లా)
ఫుడ్ టెక్నాలజీలో డి మేఘన (విశాఖపట్నం)
ఇన్స్ట్రుమెంటేషన్ లో కే. కిషోర్ (పాలకోడేరు, పశ్చిమ గోదావరి)
మెకానిక్ లో సీబీడీ. కాశీవిశ్వనాథ్ (పెద్దాపురం, తూర్పు గోదావరి)
మెటలర్జీ లో జి. నరేష్ కుమార్ (విజయనగరం)
నానో టెక్నాలజీ లో బి. అర్పిత (విశాఖపట్నం)
ఫార్మసీలో ఐ. విద్య (గుంటూరు)
Download Results