appsc

APPSC CPT కి దరఖాస్తులు

APPSC CPT కి దరఖాస్తులు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) కు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5 (పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్) విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-2, గ్రేడ్-1 (రెవెన్యూ) ఉద్యోగులకు ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తారు. వీరితో పాటు 2014 మే 12వ తేదీ తర్వాత కారుణ్య నియామకాల ద్వారా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ నుంచి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గా ఉద్యోగోన్నతి పొందిన వారికి ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్ష జరగనుంది. వీరు ఈ నెల 10వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ఏపీపీఎస్సీ వారు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button