APPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ వార్డ్/విలేజ్ సెక్రటేరియట్ నోటిఫికేషన్ 2021
డిపార్ట్మెంటల్ టెస్ట్ వార్డ్/విలేజ్ సెక్రటేరియట్ నోటిఫికేషన్ 2021.
APPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ వార్డు/విలేజ్ సెక్రటేరియట్ నోటిఫికేషన్ 2021ను విడుదల చేశారు. దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్ లో 13-09-2021 నుండి 17-09-2021 వరకు స్వీకరించబడతాయి. దీనికి సంబంధించిన పరీక్షలు 28/09/2021 నుండి 30/09/2021 వరకు జరుగుతాయి.
APPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ స్పెషల్ నోటిఫికేషన్ వార్డ్ /విలేజ్ సెక్రటేరియట్
దరఖాస్తు చేయాలనుకునేవారు కమిషన్ వెబ్సైట్ ద్వారా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) చేసుకోవాలి. http://psc.ap.gov.in ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వారికి యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన యూజర్ ఐడి మొబైల్ నెంబర్ కి మరియు ఈ మెయిల్ ఐడి కి వస్తుంది. ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ కి అప్లై చేయదలసిన వారు OTPR యూజర్ ఐడి ద్వారా కమిషన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారులు ఇదివరకే ముందే OTPR ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే వారు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేయాలనుకున్నవారు కమిషన్ వెబ్సైట్ (http://psc.ap.gov.in) లో ఈ నెల 13వ తారీకు నుండి అప్లై చేసుకోవచ్చు. 17 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు.
పరీక్షా సమయం:
ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 2 గంటలు
కన్వెన్షనల్ పేపర్స్ 3 గంటలు
ఫీజు వివరాలు:
1 ఒక పేపర్ కి ₹500 చెల్లించవలసి ఉంటుంది.
2 దరఖాస్తుదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 500 కూడా చెల్లించవలసి ఉంటుంది.
డిపార్ట్మెంటల్ స్పెషల్ నోటిఫికేషన్ 2021 టైం టేబుల్:
28-09-2021
మార్నింగ్ షిఫ్ట్ 9 AM నుండి 11AM వరకు
18 రెవెన్యూ టెస్ట్, పార్ట్-1 ఫస్ట్ పేపర్ ( బుక్స్ తో)
137 ద అకౌంట్స్ టెస్ట్ ఫర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్, పేపర్-1 (బుక్స్ తో)
28-09-2021
ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 12:30 PM నుండి 2:30 PM వరకు
27 ద రెవెన్యూ టెస్ట్ పార్ట్-1 సెకండ్ పేపర్ (బుక్స్ తో)
170 డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (బుక్స్ లేకుండా)
28-09-2021
ఈవినింగ్ షిఫ్ట్ 4 PM నుండి 6 PM వరకు
43 ద రెవెన్యూ టెస్ట్ పార్ట్-2 (బుక్స్ తో)
142 ద అకౌంట్స్ టెస్ట్ ఫర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్స్ పేపర్-2 (బుక్స్ తో)
29-09-2021
మార్నింగ్ షిఫ్ట్ 9 AM నుండి 11 AM వరకు
95 ఫిషరీస్ డిపార్ట్మెంట్ టెస్ట్-1 (విత్ బుక్స్)
146 అకౌంట్స్ టెస్ట్ ఫర్ ద ఎంప్లాయిస్ ఆఫ్ లోకల్ బాడీస్ పేపర్-1 (బుక్స్ తో)
29-09-2021
ఆఫ్టర్ నూన్ షిఫ్ట్ 2 PM నుండి 4 PM వరకు
32 డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ ఎంప్లాయిస్ ఆఫ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ పార్ట్-1 పేపర్-1 ( బుక్స్ లేకుండా)
148 అకౌంట్స్ టెస్ట్ ఫర్ ద ఎంప్లాయిస్ ఆఫ్ లోకల్ బాడీస్ పేపర్-2 (బుక్స్ తో)
30-09-2021
మార్నింగ్ షిఫ్ట్ 9 AM నుండి 12 PM వరకు
161 విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3, పేపర్-1(బుక్స్ లేకుండా) (డిస్క్రిప్టివ్ టైప్ 3 గంటలు)
30-09-2021
ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2:30 PM నుండి 5:30 PM వరకు
162 విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3, పేపర్-2 (బుక్స్ లేకుండా) (డిస్క్రిప్టివ్ టైప్ 3 గంటలు)