APPSC మరో 2 నోటిఫికేషన్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు(ఎపిపిఎస్‌సి) వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. దీనిలో భాగంగా గురువారం మరో 2 నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులు-6, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డిపిఆర్‌ఒ) పోస్టులు-4 భర్తీ చేయడానికి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది.
కమిషన్ కార్యదర్శి ఆంజనేయులు గారు మాట్లాడుతూ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులకు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు, డిపిఆర్‌ఒ పోస్టులకు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు.
official website: https://psc.ap.gov.in/(S(juw35b3i120we0my34qawj10))/Default.aspx