AP Teacher News

Central Government Minority Scholarship Applications

Central Government Minority Scholarship Applications

కేంద్ర ప్రభుత్వం మైనార్టీ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

చిత్తూరు: కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం ఇచ్చే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్పుల కోసం దరఖాస్తులను ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి కోరారు. ఈ అంశంపై అవగాహన కార్యక్రమం గురువారం అంబేద్కర్ భవన్లో జరిగింది. ఆర్ఐవో శ్రీనివాసులురెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం పాల్గొన్నారు.

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు సంవత్సరాదాయం లక్షల లోపు ఉంటే వెయ్యి రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐదు వేలు ఇస్తారు.

రెండు లక్షల లోపు ఆదాయం కలిగిన కుటుంబాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 12000వేల ఇస్తారు.

రూ. 2.50 లక్షల లోపు ఆదాయం కలిగిన వృత్తి విద్యా కోర్సులు చేస్తున్న విద్యార్థులకు మెరిట్ కమ్ మీన్స్ కింద రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు సాయం అందిస్తారు.

50 శాతం మార్కులు పొందిన వారే అర్హులు.

ముందు తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, కులం, ఆదాయం, నివాస ధ్రువపత్రం, విద్యార్థుల పేరిట బ్యాంకు ఖాతా సిద్ధం చేసుకోవాలి.

దరఖాస్తులు www.scholarship.gov.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.